Advertisementt

రజనీకి మరో అత్యున్నత పురస్కారం!

Mon 25th Jan 2016 12:07 PM
rajinikanth,padma vibhushan,super star rajinikanth,south cinema industry  రజనీకి మరో అత్యున్నత పురస్కారం!
రజనీకి మరో అత్యున్నత పురస్కారం!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది పద్మ అవార్డులు వచ్చే అవకాశం ఉండి, సిఫార్స్‌ చేయబడిన వారి లిస్ట్‌లోనుండి ముగ్గురి పేర్లు బయటకు వచ్చాయి. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలు చేసినందుకు గాను ఆయనకు పద్మ విభూషణ్‌ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే అనుపమ్‌ఖేర్‌కు పద్మభూషణ్‌ అవార్డు, ప్రియాంకా చోప్రా పద్మశ్రీ అవార్డుల రేసులో ఉన్నారు, జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అఫిషియల్‌గా ప్రకటిస్తారు. కిందటి సంవత్సరం కూడా రజనీని అవార్డు వరిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత పేరు తొలగించారు. అప్పట్లో పేరు తొలగించిన 1,793 మంది పేర్లలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, యోగా గురువు రామ్‌దేవ్‌బాబా, బిజెపి నాయకుడు, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శతృఘ్నుసిన్హా తదితరులు ఉన్నారు. వారిని అవార్డులకు సిఫార్స్‌ చేసినప్పటికీ వారికి పద్మ అవార్డులు రాలేదు. 2000వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం నుండి పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న రజనీకాంత్‌కు ఈసారి రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్‌ అవార్డుకు సిఫార్స్‌ చేశారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ