నందమూరి తారక రామారావు గారు కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. అవసరాన్ని బట్టి తానే నటిస్తూ, దర్శకత్వం వహించి అలాగే కొన్ని కళాఖండాలు నిర్మించిన ఘనత కూడా ఆయనకే చెల్లింది. కానీ అప్పటి సినిమా లెక్కలకు ఇప్పటి సినిమా లెక్కలకు జమీన్ ఆస్మాన్ తేడా ఉంది. అందుకే ఎన్టీయార్ తరువాత అంతటి విలక్షణత కలిగిన తెలుగు నటులేవరూ మన తరానికి పరిచయం కాలేదు. తండ్రి ప్రతిష్టను ఇనుమడింపజేసే ఆలోచనలు కొన్ని కొడుకుగా బాలకృష్ణ చేసినప్పటికీ దర్శకత్వం వైపు ఆయన ఎప్పుడూ పెద్దగా దృష్టి సారించిన సందర్భాలు లేవు. సరిగ్గా 100వ సినిమా ముంగిట నిలబడిన బాలకృష్ణను మరి మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడని ప్రశ్నిస్తే, నాకు అలాంటి ఇలాంటి సినిమాలు డైరెక్ట్ చేయడం ససేమిరా ఇష్టం లేదు. దర్శకుడిగా నా ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. నర్తనశాలను డైరెక్ట్ చేయాలనుకున్న, అది కుదరలేదు. జానపదం, పౌరాణికాల్లాంటివి ఇంకేవైనా అబ్బురపరిచే సబ్జెక్టులు దొరికితే తప్పకుండా భవిష్యత్తులో దర్శకత్వం వహిస్తా. నేను చేసిన పెద్దన్నయ్య చిత్రం యొక్క క్లైమాక్స్ సీన్ పూర్తిగా నేను డైరెక్ట్ చేసిందే. కేవలం ఆ ముగింపు ఘట్టాలతోనే పెద్దన్నయ్య 100 రోజులు ఆడింది. అటువంటి సంతృప్తి చాలు నాకు, అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. అంటే ఆషామాషీ సినిమాలు కాదు, కొడితే 100 రోజులు ఆడే సినిమాకే నటసింహం దర్శకత్వం వహిస్తారన్న మాట.