చేతిలో ఇనుపగోళంతో ఆయుధాన్ని చేతబట్టి, కండలు చూపిస్తూ మొహం చూపించకుండా విడుదలైన బన్నీ 'సరైనోడు' ప్రీలుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ లుక్‌కు బన్నీ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కాగా ఫస్ట్‌లుక్‌ను రిపబ్లిక్‌డే కానుకగా జనవరి 26న విడుదల చేయనున్నారు. బోయపాటి అంటే మాస్‌ను కేరాఫ్ అడ్రస్‌గా చెప్పాలి. ఆయన సినిమా స్టోరీ ఎలాంటిదైనా, హీరో ఎవరైనా హీరో ఆయుధం పట్టాల్సిందే. రక్తం చిందాల్సిందే. బన్నీ కోసం కూడా ఆయన ఏమాత్రం మారలేదని ఈ ప్రీలుక్ చూస్తే అర్థం అవుతుంది. మాస్‌లుక్‌తో విడుదలైన ఈ చిత్రం ప్రీ లుక్ అదిరిపోయింది. దీంతో బోయపాటి ఈ సినిమాను కూడా తన పంధాలోనే తీస్తున్నాడని అంటున్నారు. వాస్తవానికి బన్నీకి మాస్ ప్రేక్షకులు, యూత్‌తో పాటు 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలతో ఫ్యామిలీ ఇమేజ్ కూడా వచ్చింది. మరి ఈ చిత్రంలో బోయపాటి బన్నీని ఎలా చూపిస్తాడో చూడాల్సివుంది...! రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్.. ఇలా ఎవరు హీరో అయినా బోయపాటి మాత్రం మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌ను వదిలేలా కనిపించడం లేదు. మరి బన్నీని బోయపాటి 'సరైనోడు'లో ఎలా చూపిస్తాడో చూడాల్సివుంది..!