Advertisementt

నాగ్‌తోనే చైతూకు ఇబ్బంది..!

Sun 24th Jan 2016 04:47 PM
nagarjuna,nagachaitanya,sahasam swasaga sagipo,upiri movie  నాగ్‌తోనే చైతూకు ఇబ్బంది..!
నాగ్‌తోనే చైతూకు ఇబ్బంది..!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అది గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో కోనవెంకట్‌ సమర్పణలో 'సాహసం శ్వాసగా సాగిపో' ఒకటి కాగా రెండోది మలయళ సూపర్‌హిట్‌ మూవీ 'ప్రేమమ్‌'కు రీమేక్‌గా రూపొందుతున్న 'మజ్ను' చిత్రం, కాగా 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ఆడియోను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసి అప్పుడు థియేటికల్‌ ట్రైలర్‌ విడుదలచేసి రిలీజ్‌ డేట్‌ ప్రకటించాలని నిర్ణయించారు. ఇక కాస్త అటు ఇటుగా 'మజ్ను' పరిస్థితి కూడా అంతే. ఇలా నాగచైతన్య నటిస్తున్న రెండు చిత్రాలు కొద్ది రోజుల గ్యాప్‌లోనే రావచ్చని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. కానీ నాగార్జున తాజాగా నటిస్తున్న 'ఊపిరి' చిత్రం కూడా మార్చి 25నే విడుదల కానుంది. సో... వీటి మధ్య రిలీజ్‌ డేట్‌ విషయంలో కాస్త క్లాష్‌ రాకుండా విడుదల చేయాలని నాగ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. మొత్తానికి ఇప్పుడు 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం విడుదలైన తర్వాత అందరూ ఆ చిత్రం గురించే మాట్లాడుకుంటూ ఉంటే... ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టి తండ్రికి తగ్గ తనయుడుగా అందరూ తన చిత్రం గురించే మాట్లాడుకోవాలని, తండ్రి సినిమాను మించిన విజయాన్ని సాదించి అందరూ తన గురించే మాట్లాడుకునేలా చేయాలని చైతూ ఆశపడుతున్నాడు. మరి అక్కినేని అభిమానులు చైతూ రెండు చిత్రాలు, నాగ్‌ 'ఊపిరి'.. ఇలా మూడు చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలుస్తాయని ఆశ పడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ