Advertisementt

చరణ్, ఎన్టీఆర్ లకు నిర్మాతల బ్రేక్!

Sun 24th Jan 2016 04:13 PM
ram charan,ntr,janatha garage,thani oruvan  చరణ్, ఎన్టీఆర్ లకు నిర్మాతల బ్రేక్!
చరణ్, ఎన్టీఆర్ లకు నిర్మాతల బ్రేక్!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఆయనకు 'బాద్‌షా, టెంపర్‌'లతోపాటు తాజాగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాల రూపంలో మంచి హిట్స్‌ వచ్చాయని అందరూ భావిస్తున్నా.. ఈ చిత్రాలు ఓవర్‌ బడ్జెట్‌ కారణంగా కాస్ట్‌ఫెయిల్యూర్‌గా నిలుస్తున్నాయి. మరోవైపు రామ్‌చరణ్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాగా త్వరలో ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో 'శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్‌ అధినేతలు తాజాగా నిర్మిస్తున్న 'జనతాగ్యారేజ్‌' చిత్రాన్ని కేవలం నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్‌ చేసుకున్నారట. అంతేకాకుండా ఈ చిత్రం కాస్ట్‌ఫెయిల్యూర్‌ కాకుండా ఉండే ఉద్ధేశ్యంతో ఈ చిత్రాన్ని కేవలం 40కోట్ల బడ్జెట్‌లోపే తీయాలని కొరటాల శివకు, ఎన్టీఆర్‌కు వెల్లడించారని సమాచారం. కాగా రామ్‌చరణ్‌ విషయానికి వస్తే ఆయన చేయబోయే కొత్త చిత్రం తమిళ 'తని ఒరువన్‌' కావడంతో ఈ చిత్రాన్ని కూడా కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని అల్లుఅరవింద్‌ ఆలోచిస్తున్నాడు. అందునా ఈ చిత్రం ఓ రీమేక్‌ కావడంతో బడ్జెట్‌ 25 నుండి 30కోట్ల లోపలే పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరి రెండో వారంలో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. ఈ రెండు చిత్రాలు ఆగష్టు 12నే విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ముందస్తు ప్రణాళికలతో ఉన్నారని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ