మలయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్' రీమేక్‌లో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం స్టోరీ ప్రకారం ఈ చిత్రంలో మూడు లవ్‌స్టోరీలు ఉంటాయి. ఒక లవ్ స్టోరీలో లెక్చరర్ శృతిహాసన్‌తో స్టూడెంట్ నాగచైతన్య నడిపే ప్రేమకథ కాగా, రెండో లవ్‌స్టోరీ చైతు-అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య నడుస్తుంది. మూడో లవ్‌స్టోరీలో చైతు-మడోనా సెబాస్టియన్ మద్య నడుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రం టీజర్‌ను, ఫస్ట్‌లుక్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య కూడా మూడు డిఫరెంట్ గెటప్‌లలో కనిపించి అలరించనున్నాడు. మరి ఈ చిత్రం మలయాళంలోలాగా తెలుగులో కూడా సూపర్‌హిట్టు అవుతుందో లేదో వేచిచూడాల్సివుంది..!