ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ధియేటికల్ రైట్స్‌ను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 70కోట్లకు తీసుకుందని సమాచారం. పవన్ సోలో హీరోగా వచ్చి చాలాకాలం దాటడంతో ఈ సినిమాపై పవన్ అభిమానులకే కాదు... సాధారణ ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్ మిత్రుడు శరత్‌మరార్ తన నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఈరోస్ సంస్థ ముఖ్య ఫైనాన్షియర్ కాగా, పవన్ కల్యాణ్‌కు చెందిన పవన్‌కళ్యాన్ క్రియేటివ్ వర్క్స్ కూడా ఇందులో భాగస్వామి కావడం గమనార్హం. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే 6వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాగా పవన్‌కళ్యాణ్ హీరోగా నటించి సమ్మర్‌కు విడుదలైన 'బద్రి, ఖుషీ, జల్సా, గబ్బర్‌సింగ్' వంటి చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ ప్రకారం 'సర్దార్‌గబ్బర్‌సింగ్' కూడా భారీ హిట్ సాధిస్తుందనే సెంటిమెంట్ ఏర్పడింది. కాగా ఈ చిత్రం ఆడియో వేడుకను మార్చి 12న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఆడియో ఎంత పెద్ద ఘనవిజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...!