Advertisementt

తమిళ్ లో సంక్రాంతి విన్నర్స్ వీళ్ళే!

Sat 23rd Jan 2016 11:06 AM
sivakarthikeyan,sankranthi winners,gethu,vishal,kollywood  తమిళ్ లో సంక్రాంతి విన్నర్స్ వీళ్ళే!
తమిళ్ లో సంక్రాంతి విన్నర్స్ వీళ్ళే!
Advertisement
Ads by CJ

తెలుగులో సంక్రాంతి పండుగకి నాలుగు చిత్రాలు పోటీపడగా కోలీవుడ్‌లో కూడా ఈ పొంగల్‌కు నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే అవి అన్నీ మీడియం బడ్జెట్‌తో నిర్మితమయిన సెకండ్‌ గ్రేడ్‌ హీరోలతో రూపొందినవే కావడం విశేషం. కాగా ఈ పొంగల్‌కి విడుదలైన ఈ నాలుగు తమిళ చిత్రాల్లో రెండు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించి హిట్లుగా నిలబడ్డాయి. మరో రెండు చిత్రాలలో ఒకటి యావరేజ్‌ టాక్‌ తెచ్చుకోగా, మరో చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ఈ పొంగల్‌కి కోలీవుడ్‌ విజేతలుగా విశాల్‌, శివకార్తికేయన్‌లు నిలిచారు. విశాల్‌ నటించి పాండిరాజ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'కథకళి' చిత్రం మొదటి వారంలో 17కోట్లు వసూలు చేసి ఇప్పటికీ మంచి కలెక్షన్లతో రన్‌ అవుతోంది. మరోపక్క వరుస విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్‌ హీరోగా నటించిన 'రజనీమురుగన్‌' చిత్రం మొదటి వారంలో 19కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక బాల దర్శకత్వంలో వచ్చిన 'తారైతప్పెట్లై' చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కనీస కలెక్షన్లు కూడా లేక దెబ్బతింది. ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా నటించిన 'గేతు'కు కూడా కలెక్షన్లు లేక థియేటర్స్ బోసిపోతున్నాయి. సో... ఈ పొంగల్‌ విజేతలుగా చివరకు విశాల్‌, శివకార్తికేయన్‌లు నిలిచారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ