అల్లు అర్జున్ సరైనోడు ఫస్ట్ లుక్ ఈ నెల 26న రిలీజుకు సిద్ధమవుతోంది. ఇంతలోనే అంత ఆత్రం ఏంటి అనుకుంటున్నారా. ఫస్ట్ లుక్ కన్నా ముందు ప్రీ లుక్ పేరిట బన్నీ బాడీని, బాడీ లాంగ్వేజుని మాత్రమే ఫోకస్ చేసే స్టిల్ ఒకటి నిర్మాతలు విడుదల చేసారు. జిమ్ములో వాడే బరువైన కెటిల్ బెల్ ఒకటి చేతిలో పట్టుకున్న బన్నీ నిజమైన వీరుడిలా అగుపిస్తున్నాడు. బన్నీ ఫేస్ ఇక్కడ రివీల్ చేయకపోయినా కండలు తిరిగిన బైసెప్స్, చీల్చుకుని వస్తున్న చాతిని, గుండెని ఆపలేకుండా ఉన్న షర్టు బటన్స్ అన్నీ కలిపి మైండ్ బ్లోయింగ్ ఫీల్ క్రియేట్ చేసాయి. దర్శకుడు బోయపాటి శ్రీను అంటే యాక్షన్ సీన్లకు పెట్టింది పేరు. ఈ మధ్య కాలంలో బాలయ్య బాబుతో బాక్సాఫీసుని బంతాడుతున్న బోయపాటి చాన్నాళ్ళ తరువాత యూత్ హీరో మీద మొదలెట్టిన ఈ చిత్రం ప్రీ లుక్ అయితే బాక్సాఫీసుకి అమ్మ మొగుడులా ఉంది. ఇక ఫస్ట్ లుక్, అటు తరువాత టీజర్ వచ్చేసే సమయానికి సరైనోడు క్రేజ్ ఆకాశానికి దగ్గరగా ఉంటుందేమో!