Advertisementt

జనతా గ్యారేజీ, కొరటాల మొదటి కథ

Fri 22nd Jan 2016 07:53 PM
janatha garage,jr ntr,koratala siva  జనతా గ్యారేజీ, కొరటాల మొదటి కథ
జనతా గ్యారేజీ, కొరటాల మొదటి కథ
Advertisement
Ads by CJ

కథా రచయితల దగ్గర కథల కొరత ఉండకపోయినా అవకాశం, అదృష్టం వచ్చినప్పుడు ఆ కళని సద్వినియోగం చేసుకుంటేనే సినిమా పరిశ్రమలో మనుగడ సాధించగలిగేది. ఏళ్ళ తరబడి ఇక్కడే సింగిల్ రూముల్లో మగ్గి జాక్ పాట్ కొట్టిన అలాంటి కొందరు మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఈ సోది మొత్తం ఎందుకంటే రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ అపురూపంగా రాసుకున్న తన మొదటి కథ గురించి చెప్పేందుకు. సుమారు పదేళ్ళ క్రితం మాటే. కొరటాల రచయితగా తన పెన్నుకు పదును పెడుతున్న రోజుల్లో రాసిన ఓ కథనే ఇప్పుడు జనతా గ్యారేజీ పేరుతో  జూనియర్ ఎన్టీయార్ హీరోగా షూటింగ్ మొదలవబోతోంది. చాన్నాళ్ళ నుండి ఈ కథను కొందరు హీరోలకు వినిపించినా ఎక్కడా మెటీరియలైజ్ అవలేదు. మిర్చి, శ్రీమంతుడు విజయాల తరువాత తాను రాసుకున్న పాత కథకే కొత్త మెరుగులు దిద్ది జనతా గ్యారేజీ అంటూ వదలబోతున్నాడు. ఎంత కాదన్నా కెరీర్ మొదట్లో ఉండే ఆ ఫైర్ మొత్తం ఈ గ్యారేజీలో కనపడితే ఆమ్ జనతా సూపర్ హిట్టు ఫలితాన్ని అందజేస్తారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ