ఎరుపు అన్న సినిమా టైటిల్ విన్ననాటి నుండి మనకు మరుపు రాకుండా ఉన్నట్లుంది కదా. ఇదిగో ఈ ఎరుపు టీజర్ కూడా చూసేస్తే మరిచిపోయిన ఓ పైరసీ గాధను మళ్ళీ ఆలకించినట్టుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది రిలీజుకు ముందరే పైరసీకి లోనవడం మనకు తెలిసిందే. సరిగ్గా ఆ పాయింట్ ఆధారంగానే ఎరుపు తీసినట్టుంది. ఇన్నాళ్ళూ పవన్ కళ్యాణ్ పేరులోని మహిమ వాడుకున్నోల్లకు వాడుకున్నంతగా పని చేసేది. ఈసారి మాత్రం కొత్త దర్శకుడు వెంకట కృష్ణ వాడకం చాలా కొత్తగా ఉంది. టీజర్ సాంతం చూస్తుంటే సినిమా కథ మొత్తం అత్తారింటికి దారేది పైరసీపైనే నడిచినట్టు తెలుస్తోంది. ఎడిటింగ్ టేబుల్ మీదనో లేక నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారి ఆఫీసు టేబుల్ మీదనో సరిగ్గా తెలీదు గానీ అత్తారింటికి ఫస్ట్ కాపీ తస్కరించబడి అటు నుండి అంతర్జాలంలోకి ప్రవేశించింది. ఈ ఊహాజనిత సన్నివేశాల సమాహారమే ఎరుపు. వీటికి అత్తారింటికి దారేది మెయిన్ సీన్లు కొన్ని, పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా పైరసీ దొంగల భరతం పడతానని సభాముఖంగా హెచ్చరించిన సీన్లను జతకలిపి ఎరుపు టీజర్ వదిలారు. పవర్ స్టార్ అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికి ఇదేదో కొత్త స్కెచులా ఉంది. ఏమంటారు ఆనంద్ రంగా గారూ?