తన సినిమాల ప్లానింగ్ విషయంలో దిల్ రాజు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముందు కథ, కథనాల పట్ల ఆయన ఫుల్లుగా సంతృప్తి చెందితేగాని సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళరు. అందుకే దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే కథాబలం ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. మరి ఇంత పేరు మోసిన దిల్ రాజు జడ్జిమెంట్ తప్పేమో అన్న అనుమానం రావడంతోనే రవితేజ ఓ సినిమా వదిలేసుకున్నాడని సమాచారం. ఓహ్ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎవడో ఒకడు అనే టైటిల్ మీద రవితేజ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా ఓ ప్రాజెక్టు లాంచ్ అయిన విషయం విదితమే. సెకండ్ హాఫ్ కథ మాస్ రాజాకు నచ్చకపోవడంతో కొన్ని కరెక్షన్స్ చెప్పడము, వాటికి వేణు శ్రీరాం, దిల్ రాజులు అంగీకరించకపోవడంతో ఈ సినిమా ముహూర్తంతోనే ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఇదే కథకు ఇంకొన్ని మార్పులు చేర్పులు చేసి అక్కినేని నాగార్జునను హీరోగా పెట్టి వేణు శ్రీరాం దర్శకుడిగా మరో ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో పడ్డారట దిల్ రాజు. ఇందుకుగాను రానున్న మరో వారం పది రోజుల్లో ఫస్ట్ నరేషన్ ఇవ్వడానికి వేణు శ్రీరాం సిద్ధమవనున్నాడని లోకల్ టాక్.