ప్రస్తుతం మహేష్ చేస్తున్న బ్రహ్మూెత్సవం తర్వాత మురుగదాస్ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో మహేష్, మురుగదాస్ తెగ డిస్కస్ చేస్తున్నారట. ఆల్రెడీ మహేష్‌తో నటించిన వారు, ప్రస్తుతం తెలుగులో హీరోయిన్‌గా నటిస్తున్న వారు కాకుండా కొత్తవారితో ట్రై చేద్దామని మొదట అనుకున్న మహేష్ ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేస్తున్నాడు. తనకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే అంటే ఇష్టమని ఓ సందర్భంలో మహేష్ చెప్పాడు. దానికి దీపిక ఎంతో సంతోష పడింది. టాలీవుడ్ సూపర్‌స్టార్‌కి తనంటే ఇష్టమని ఓపెన్‌గా చెప్పడం హ్యాపీగా వుందని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీన్ని బట్టి త్వరలోనే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు.
అది మురుగదాస్‌తో మహేష్ చేయబోయే సినిమాకి జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దీపికా పదుకొనే ని మురుగదాస్, అతని టీమ్ అప్రోచ్ అయిందట. దీపిక కూడా ఈ విషయంలో పాజిటివ్‌గానే రియాక్ట్ అయిందని తెలుస్తోంది. ఒక సినిమాకి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే దీపికా మరి ఈ సినిమాకి ఎంత చార్జ్ చేస్తుందో తెలీదు. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్‌లోనే వున్న హీరోయిన్ విషయాన్ని త్వరలోనే ఫైనల్ చేస్తారట.