Advertisementt

నాని మళ్ళీ ఇరగేసేలా ఉన్నాడు!

Thu 21st Jan 2016 11:28 PM
krishna gaadi veera prema gaatha trailer review,nani  నాని మళ్ళీ ఇరగేసేలా ఉన్నాడు!
నాని మళ్ళీ ఇరగేసేలా ఉన్నాడు!
Advertisement
Ads by CJ

 

భలే భలే మగాడివోయ్ చిత్రంతో హీరోగా నానికి మరో జన్మ లభించినంత పనయింది. వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో ఈ సినిమా సంజీవనిలా వచ్చింది. అందుకే ఆచితూచి అడుగులేస్తున్న నాని నుండి రానున్న తదుపరి చిత్రం కృష్ణగాడి వీరప్రేమగాథ. నిన్నేపాటల పండగ జరుపుకున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షించింది. నాని, సత్యం రాజేష్ కలిసి ట్రైలర్ ఆరంభించిన పద్ధతే అందరినీ కట్టి పడేసింది. రెండు నిమిషాల నిడివిలో ఒక సినిమాలోని విశేషాలు ఎన్ని విప్పిచెప్పగలరో అన్నింటినీ టచ్ చేసారు దర్శకుడు హను రాఘవపుడి. హీరో నాని, హీరోయిన్ మెహ్రీన్ మధ్య ప్రేమ; ఆంజనేయ స్వామిని నమ్ముకున్న ఓ పిరికి హీరోలో ఎప్పటి నుండో రగులుతున్న పగ, ప్రతీకారం; తద్వారా ప్రేమను అండ్ పగను సాధించుకునే క్రమంలో హీరో చేసిన చిన్నపిల్లల కిడ్నాప్... ఇలా ప్రతి సన్నివేశంలో నవ్యత కనపడింది. కెమెరామెన్ యువరాజ్, సంగీతదర్శకత్వం వచించిన విశాల్ చంద్రశేఖ ప్ర్రతిభ కూడా ట్రైలర్ అంతటా గోచరించింది. భలే భలే మగాడివోయ్ తరువాత నాని చేస్తున్న ఈ కృష్ణగాడి వీరప్రేమగాథ నిజంగా భలే భలే ఫీల్ క్రియేట్ చేసింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ