పవన్ కళ్యాణ్ సింగపూర్ ట్రిప్ అంటూ గత రెండు రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిని మరో సింగపూరుగా తయారు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణాలు చేస్తున్నారు గనక నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని అక్కడి అభివృద్ది పథకాలని అంచనా వేసిరమ్మని పంపుతున్నారేమో అన్న అర్థం వచ్చేలా కొన్ని కథనాలు సాగాయి. పవన్ ఏ దేశం పోయినా ఫర్వాలేదు బట్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ పూర్తి చేసి రిలీజయ్యే వరకు సినిమానే పట్టుకుని ఉండాలన్నది అభిమానుల ఆలోచన, ఆకాంక్ష. ఎందుకంటే అత్తారింటికి దారేది తరువాత పవర్ స్టార్ స్పీడు మామూలుగా తగ్గలేదు. పైగా రాజకీయాల్లోకి కూడా వచ్చేసాడు. మరి ఫ్యాన్స్ ఆలోచనలు పవన్ దగ్గరకు చేరాయి ఏమో కాబోలు సింగపూర్ ట్రిప్ రద్దు చేసుకుని సర్దార్ చిత్రీకరణలోనే సమయం మొత్తం వెచ్చిస్తున్నాడు. ఈ నెలాఖరు వరకు జరిగే హైదరాబాద్ షెడ్యూలులో పవన్ ఉంటారని, దీనితో మేజర్ షూటింగ్ పూర్తవుతుందని, రిలీజ్ పక్కాగా వేసవి సెలవుల్లో ఉంటుందని నిర్మాత శరత్ మరార్ తెలియజేసారు.