Advertisementt

ఏందీ జోష్ బాలయ్య బాబూ!

Thu 21st Jan 2016 06:07 PM
balakrishna,dictator success tour  ఏందీ జోష్ బాలయ్య బాబూ!
ఏందీ జోష్ బాలయ్య బాబూ!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ జోష్ చూస్తుంటే అభిమానులకే కాదు సామాన్య ప్రేక్షకులకి కూడా ఇప్పుడు తెగ ముచ్చటేస్తోంది. తన 99వ చిత్రం డిక్టేటర్ సూపర్ హిట్ అయిన వేళ లాభం పొందింది కేవలం నిర్మాతలే కాదు. సినిమాని పంపిణీదారులందరికీ అందుబాటులో ఉండే రేట్లకు అమ్మడంతో నిన్నటి నుండి అన్ని ఏరియాలలో లాభాల పంట మొదలయింది. ఇక 100వ చిత్రం ఆరంభానికి ముందు అన్నీ శుభ శకునాలే అన్నట్లుగా డిక్టేటర్ టీం మొత్తం బాలకృష్ణతో సహా రేపటి నుండి సక్సెస్ టూర్ నిర్వహించబోతున్నారు. B,C సెంటర్లలో కలెక్షన్ల హవా కొనసాగిస్తున్న ఈ చిత్రం బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణకు మచ్చు తునకగా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి విడుదలైన మరో మూడు పెద్ద చిత్రాల నడుమ డిక్టేటర్ సాధించిన విజయంతో నటసింహంలోని ఎనర్జీ పదింతలైంది. అందుకే ప్రేక్షకదేవుళ్ళను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ విజయ యాత్ర ప్లాన్ చేసారు దర్శకుడు శ్రీవాస్. హీరో బాలయ్య బాబుతో పాటు ముఖ్య నటీనటులు కూడా ఈ టూరులో పాల్గొంటారు. సినిమాకు సంబంధించి అందరూ డబ్బులు చేసుకోవడమే బాలకృష్ణ ఆనందానికి అవధులు లేకుండా చేసింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ