జూనియర్ ఎన్టీయార్ దెబ్బ మామూలుగా పడలేదు. డివైడెడ్ టాక్ వచ్చినా నాకేంటి అన్న రెంజులో నాన్నకు ప్రేమతో చిత్రం ఓవర్సీస్ అంతటా దుమ్ము రేపుతోంది. బేసిగ్గా స్టార్ హీరో సినిమా అంటే కేవలం హీరో ఎలివేషన్, దానికి జతగా నాలుగో ఐదో పాటలు, రొండో మూడో కామెడీ సీన్లు, వాటికి అతుకుల బొంతగా ఉండే కథ కథనాలు ఉంటె సరిపోద్ది అనుకుని థియేటర్స్ లోపలి వెళ్ళే జనాలకి నిజమైన మెదడుకు మేత ఇచ్చి సుకుమార్ ఆకట్టుకున్నాడు. B, C ఆడియెన్సు మాట మనకెందుకు గానీ ఓవర్సీస్ మొత్తం ఇక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగం, డబ్బు సంపాదన మీదే వెళ్ళే ఇండియన్ గ్రాడ్యుయేట్ వీక్షకులే ఎక్కువ ఉంటారు గనక సుకుమార్ జ్ఞ్యాన బోధనా పద్ధతి వాళ్లకి బాగా సరిపోయింది. సాధారణంగా అక్కడి 1 మిలియన్ డాలర్ క్లబ్బులో ఎంట్రీ కోసమే కొందరు స్టార్ హీరోలు నానా కష్టాలు పడుతుంటే తారక్ మాత్రం దర్జాగా 2 మిలియన్ డాలర్ క్లబ్బులోకి చక్కటి ఎంట్రీ తీసుకోబోతున్నాడు ఈ చిత్రంతో. అదీ ఎన్టీయారుకు మిగతా హీరోలకు ఉన్న తేడా!