Advertisementt

చిరంజీవి టైటిల్ కత్తి కాకూడదు!

Wed 20th Jan 2016 02:14 PM
chiranjeevi 150th movie,kaththi title  చిరంజీవి టైటిల్ కత్తి కాకూడదు!
చిరంజీవి టైటిల్ కత్తి కాకూడదు!
Advertisement
Ads by CJ

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా తమిళ హిట్ కత్తి తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. అందుకు గాను దర్శకుడు వీవీ వినాయక్ గారు కూడా అహర్నిశలు కష్టపడుతూ షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టడానికి కృషి చేస్తున్నారు. ఇక చిరంజీవి గారు కూడా మీసమ్ మెలేసి తానూ ఓ కొత్త లుక్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతున్నా తమిళ కత్తికి తెలుగులో ఏమని నామకరణం చేస్తున్నారో తెలీటం లేదు. చిరంజీవి 150వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాబట్టి ఆషామాషీ టైటిల్ పెడితే ఫ్యాన్స్ ఊరుకోరు. అలాగని కత్తినే వాడేసుకుందాం అనుకుంటే నందమూరి కళ్యాణ్ రామ్ ఆల్రెడీ ఓ ఫ్లాప్ కోసం వాడేసారు. అంతే కాకుండా తమిళ వర్షనులో కత్తిరేషన్ అనే హీరో విజయ్ క్యారెక్టర్ సినిమాలో ఉంటుంది కాబట్టి మురుగదాస్ తన చిత్రానికి కత్తి అని పెట్టుకున్నారు తప్పితే ఈ కత్తికి మనం వాడుకునే కత్తికి సంబంధం లేదు. చాన్నాళ్ళ వెయిటింగ్ తరువాత కథ ఫిక్స్ అయిన పిదప చిరంజీవి గారికి ఇప్పుడు ఓ పదునైన టైటిల్ కూడా కావాలి. మరి దీని కోసం ఎన్ని నెలలు వేచి చూస్తారో!!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ