మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన 'ఎక్స్‌ప్రెస్‌రాజా' కూల్ అండ్ కామెడీ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలతో పోటీపడిన ఈ చిత్రం తనకంటూ కొన్ని వసూళ్లు చేజిక్కించుకోగలిగింది. అందుకే ఇప్పుడు దర్శకుల దృష్టి శర్వానంద్‌పై పడగా, హీరోల దృష్టి మేర్లపాకగాంధీపై పడింది. పలువురు హీరోలు మేర్లపాక గాంధీపై కర్చీఫ్ వేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముందుగా రామ్‌చరణ్ నుండి మేర్లపాక గాంధీకి పిలుపొచ్చినట్లు తెలుస్తోంది. 'ఎక్స్‌ప్రెస్‌రాజా'లా కామెడీ సినిమా కాకపోయినా ఓ డిఫరెంట్ సబ్జెక్ ఉంటే చెప్పమని చరణ్ అడిగాడట. దాంతో మేర్లపాక గాంధీ కూడా ఎగ్జైట్ అయినట్లు తెలుస్తోంది. ఒకటిరెండు రోజుల్లో చరణ్‌కు గాంధీ స్టోరీ వినిపించనున్నాడని సమాచారం. రామ్‌చరణ్‌తో పాటు నాగచైతన్య కూడా గాంధీతో ఓ సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.