మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 150వ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని మెగాభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో విజయ్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో సూపర్‌హిట్టు అయిన 'కత్తి'కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. మార్చి 27న మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ఇందులో చిరు సరసన హీరోయిన్‌గా నయనతారను, విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్‌ఒబేరాయ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇంతకు ముందు వినాయక్-చిరంజీవిల కాంబినేషన్‌లో వచ్చిన రీమేక్ 'ఠాగూర్' దారిలోనే ఈ తాజా చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందని మెగాభిమానులు ఆశతో ఉన్నారు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలకు తెరలేపనుందో వేచిచూడాలి...!