Advertisementt

22న 'కథాకళి'..!

Tue 19th Jan 2016 12:41 PM
vishal,kathakali movie,releasing on 22nd january,pandiraj  22న 'కథాకళి'..!
22న 'కథాకళి'..!
Advertisement
Ads by CJ

విశాల్‌. కేధరిన్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'కథాకళి'. విశాల్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని వాస్తవానికి సంక్రాంతి బరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ తెలుగులో భారీ సినిమాలు పోటీలో ఉండటం, థియేటర్లు దొరక్కపోవడంతో ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే రోజున విడుదల చేయలేకపోయారు. తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకొంది. తాజాగా ఈ చిత్రాన్ని ఈనెల 22న తెలుగులో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తెలుగులోనూ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు. పుల్‌లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా తనకు మరో మంచి హిట్‌ను సాధించి పెడుతుందనే నమ్మకాన్ని హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌ అయిన విశాల్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. కాగా ఈచిత్రానికి మాటలను శశాంక్ వెన్నెలకంటి అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని వెన్నెలకంటి, భువనచంద్రలు అందిస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ