Advertisementt

'నాన్నకు....'కు ఆ బెడద ఎక్కువైందట..!

Tue 19th Jan 2016 12:01 PM
ntr,nannaku prematho movie,piracy,australian pirates  'నాన్నకు....'కు ఆ బెడద ఎక్కువైందట..!
'నాన్నకు....'కు ఆ బెడద ఎక్కువైందట..!
Advertisement
Ads by CJ

'నాన్నకు ప్రేమతో' సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా నిలుస్తోంది. మొదట నుండి ఈ సినిమాపై భారీఅంచనాలు ఉండటం, సంక్రాంతి రేసులోని సినిమాలన్నింటి కంటే ఈ చిత్రానికే ఎక్కువ మంది ఓటేశారు. దీంతో 50కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు మొదటి చాయిస్‌గా మారింది. దీంతో ఈ చిత్రంపై పైరసీదారుల చూపు కూడా పడింది. అందరూ చూడాలనుకుంటున్న చిత్రం అని టాక్‌ రావడంతో ఇతర సినిమాల కంటే 'నాన్నకు ప్రేమతో'పైనే పైరసీకారులు మొదటి చాయిస్‌ ఇచ్చారు. ఇలా పైరసీదారులు రెచ్చిపోవడం నిర్మాతలను, బయ్యర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ చిత్రం ఆస్ట్రేలియన్‌ పైరెట్స్‌ చేతికి చిక్కిందని, విదేశాల్లో ఈ చిత్రం పైరసీ సీడీలు జోరుగా స్ప్రెడ్‌ అయ్యాయని తెలుస్తోంది. దీనివల్ల సినిమా రెవిన్యూ మీద తీవ్ర ప్రభావం పడుతోంది అనేది నిర్మాతల, బయ్యర్ల భయం. దీంతో వీరినుండి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఎన్టీఆర్‌ గత చిత్రాలను 'టెంపర్‌, బాద్‌షా'ల కాంబినేషన్‌తో 'నాన్నకు ప్రేమతో' సీడీలు విక్రయిస్తున్నారు. అయితే విదేశాల్లో పైరసీ కావడంతో నిర్మాతలు ఏమి చేయలేకపోతున్నారు. ఇండియాలో ఈ పైరసీని అడ్దుకునేందుకు నిర్మాతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఈ సినిమా పైరసీ లింక్స్‌ ఎక్కడ కనిపించినా బ్లాక్‌ చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీం పని చేస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ