Advertisementt

'మరుదనాయగం' పట్టాలెక్కనుందా..?

Tue 19th Jan 2016 11:51 AM
kamal hassan,marmayogi film,laika productions  'మరుదనాయగం' పట్టాలెక్కనుందా..?
'మరుదనాయగం' పట్టాలెక్కనుందా..?
Advertisement
Ads by CJ

'మరుదనాయగం' సినిమా కమల్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. దాదాపు 10ఏళ్ల కంటే చాలా ముందు ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా ముహూర్తానికి ఎలిజిబెత్‌ రాణి రావడం అప్పట్లో సంచలనమైంది. ఆ తర్వాత షూటింగ్‌ మొదలుపెట్టి కొన్ని సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. ఇంతలో ఈ సినిమా ఆర్ధికసమస్యలతో ఆగిపోయింది. అయితే ఈ సినిమాను ఎలాగైనా మరలా ప్రారంభించాలని కమల్‌ తన ప్రయత్నం తాను చేస్తునే ఉన్నాడు. ఇప్పుడా ప్రయత్నాలు ఫలించబోయే సమయం వచ్చిందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. లండన్‌లో పెద్ద పారిశ్రామిక వేత్తగా ఉన్న కమల్‌ స్నేహితుడు ఈ సినిమాని నిర్మించడానికి ముందుకొచ్చాడని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి ఆయన ఈ సినిమా మళ్లీ మొదలు పెట్టడానికి సిద్దపడ్డాడని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అతిత్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ప్రకటన వస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి తెలుగు టైటిల్‌గా 'మర్మయోగి' అని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ