బాలకృష్ణ నటించిన 99వ చిత్రం 'డిక్టేటర్' ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అందరూ బాలయ్య త్వరలో చేయబోయే ఆయన 100వ సినిమా గురించి మాట్లాడుతున్నారు. బాలయ్య ఈ సినిమా ఎవరితో చేస్తారు? ఎలాంటి కథతో చేస్తారు? అనేది హాట్‌టాపిక్ అయింది. 100వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం బోయపాటిశ్రీను, సింగీతం శ్రీనివాసరావులలో ఒకరికి దక్కవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య వందో సినిమా చేసే అవకాశం కోసం మరికొందరు కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్ర ఓ హిస్టారికల్ కథను బాలయ్య కోసం తయారుచేసి ఈ కథకు బాలయ్య మాత్రమే న్యాయం చేయగలడని భావించి ఆయన్ను కలిసి స్క్రిప్ట్ వినిపించాడని సమాచారం. స్క్రిప్ట్ విన్న బాలయ్య బాగా ఉందని చెప్పాడట కూడా..! అయితే త్వరలో నా నిర్ణయం వెల్లడిస్తానని అన్నాడట. రవీంద్ర తయారుచేసిన స్క్రిప్ట్‌కు భారీ బడ్జెట్ అవసరం అని, విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. బాలయ్య కనుక ఓకే చెబితే, 'బాహుబలి' సినిమాకు పనిచేసిన విఎఫ్‌ఎక్స్ టీంను రంగంలోకి దించాలని పరుచూరి రవీంద్రతో పాటు పరుచూరి వెంకటేశ్వరరావులు భావిస్తున్నట్లు సమాచారం.