బాలకృష్ణకి మాస్ ప్రేక్షకుల్లో ఉండే ఫాలోయింగ్ గురించి మళ్ళీ మనం వేరేగా సంభాషించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నటసింహం గర్జించింది అంటే ముందుగా ఆ గాండ్రింపులు ప్రతిధ్వనించేవి ఈ మాస్ అభిమానుల మధ్యే. అందుకు ఏ మాత్రం తీసిపోనట్టుగా సంక్రాంతికి నందమూరి అభిమానుల పాలిట వరంగా దిగిన సినిమా డిక్టేటర్. దర్శకుడు శ్రీవాస్ అండ్ EROS వారు సంయుక్తంగా భారీ వ్యయంతో నిర్మించిన ఈ మాస్ మసాలా సినిమా బాలకృష్ణ నుండి 99వది కూడా ఒక విశిష్టత. దురదృష్టవశాత్తు కేవలం లోయర్ క్లాస్ బాలయ్య అభిమానులను మాత్రమే సంతృప్తిపరిచేలా రూపొందిన ఈ మూవీ అటు నుండి పై స్థాయికి వెళ్ళలేకపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలోని కొన్ని మాస్ సెంటర్లలో డిక్టేటర్ వసూళ్లు ఉతికి ఆరేస్తుంటే మెట్రో, సిటీస్ అండ్ ఓవర్సీసులో మాత్రం ఎటువంటి చడీచప్పుడు లేకుండా సైలెంట్ అయిపోయాడు. అందుకే బాక్సాఫీస్ పరంగా ఒక్కచోటే డిక్టేటర్ స్తంభించి పోయాడు.