Advertisementt

ఎన్టీయారుని ఎవరూ ఆపలేకపోయారు!

Mon 18th Jan 2016 01:16 PM
junior ntr,nannaku prematho,usa collections  ఎన్టీయారుని ఎవరూ ఆపలేకపోయారు!
ఎన్టీయారుని ఎవరూ ఆపలేకపోయారు!
Advertisement
Ads by CJ

ఇప్పుడున్న కుర్రహీరోల్లో జూనియర్ ఎన్టీయార్ దూకుడు మీదున్న బండి. పడిలేచిన కెరటం మాదిరిగా కసితో పని చేస్తున్నాడు. హిట్టు కొట్టాలన్న తపన అతని బాడీ లాంగ్వేజులో అణువణువునా స్పష్టంగా కనపడుతోంది. ఎప్పుడూ మూసకథలకే అతుక్కుపోతున్నాడు అన్న భావన కూడా అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ పటాపంచలు అయ్యేలా కేవలం నవ్యతకు చోటు కల్పించడం కోసమే నాన్నకు ప్రేమతో చిత్రం చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో పండక్కి ముందే తారక్ అభిమానుల్లో పండగ వాతావరణాన్ని నింపిన ఈ చిత్రం ఓవర్సీస్ అంతటా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఎన్టీయార్ సినిమాలన్నింటిలో ఈ చిత్రానికి ఉన్న స్పెషాలిటీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానం వల్ల ఇప్పటికే రికార్డ్ బ్రేకింగ్ బాక్సాఫీస్ నంబర్లు నమోదయ్యాయి. టెంపర్ నెలకొల్పిన రికార్డులు కూడా నాన్నకు ప్రేమతో దెబ్బకు మటాష్ అవడం ఖాయం. సుమారుగా మిలియన్ డాలర్ క్లబ్బుకు చేరువైన ఈ సినిమాకు నిజంగా మిగిలిన మూడు సంక్రాంతి రిలీజుల నుండి తగినంత పోటీ రాలేదనే చెప్పుకోవాలి. రానున్న వారం పది రోజులు గనక ఇదే జాతర కొనసాగితే నాన్నకు ప్రేమతో అద్భుతమైన చిత్రంగా తారక్ కెరీర్లో నిలిచిపోవడం ఖాయం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ