Advertisementt

డబ్బు కోసమే పెళ్లి చేసుకుందంట!

Mon 18th Jan 2016 11:57 AM
karishma kapoor,sanjay kapoor,money,divorce  డబ్బు కోసమే పెళ్లి చేసుకుందంట!
డబ్బు కోసమే పెళ్లి చేసుకుందంట!
Advertisement
Ads by CJ

ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరిష్మాకపూర్‌, ఆమె భర్త సంజయ్‌కపూర్‌ల మద్య గత కొంతకాలంగా విడాకుల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలాకాలం క్రితమే ఇద్దరు విడాకుల కోసం కోర్టుకెక్కారు. అయితే ఇద్దరి మద్య కొన్ని విషయాలు పరిష్కారం కాకపోవడంతో విడాకుల ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు ఒప్పుకోకపోతే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు గతేడాది నవంబర్‌లో కరిష్మా విడాకుల పిటిషన్‌ ఉపసంహరించుకొంది. అయితే తాజాగా సంజయ్‌కపూర్‌ మరోసారి విడాకుల పిటిషన్‌ దాఖలు చేశాడు. కరిష్మాకపూర్‌ నన్ను పెళ్లి చేసుకొంది కేవలం డబ్బు కోసమే అంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. గ్లామరస్‌ లైఫ్‌స్టైల్‌ కోసం వెంపర్లాడేదని, అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు అభిషేక్‌బచ్చన్‌తో బ్రేకప్‌ అయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకొని రీబౌండ్‌ అయిందంటూ పేర్కొన్నాడు. పిల్లలను తనతో కలవకుండా చేస్తోందని, విడాకుల కేసులో పిల్లలను పావులుగా వాడుకుంటోందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కరిష్మా నాకు భార్యగా, తన తల్లిదండ్రులకు కోడలిగాను, చివరకు తల్లి గానూ ఫెయిల్‌ అయిందంటూ సంజయ్‌పూర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ