స్టార్ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌ను దక్కించుకున్నాడు. హిందీలో ఉత్తమకథా రచయితగా ఆయనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది. సల్మాన్‌ఖాన్ హీరోగా నటించిన 'భజరంగీ భాయిజాన్' సినిమాకి విజయేంద్రప్రసాద్ కథను అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 300కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమాకు కథను అందించిన విజయేంద్రప్రసాద్‌కు అవార్డును తెచ్చిపెట్టింది. ఉత్తమ రచయిత విభాగంలో ఆయన ఈ అవార్డు సాధించాడు. దీంతో ఇప్పుడు చాలామంది బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమ చిత్రాలకు కథలను అందించమని విజయేంద్రప్రసాద్ వద్ద క్యూ కడుతున్నారు. మొత్తానికి మన తెలుగు రచయితకు జాతీయ స్థాయిలో ఇంత పేరు రావడం అందరూ గర్వించదగ్గ విషయమనే చెప్పాలి.