పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్' షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఆయన సంక్రాంతికి కూడా బ్రేక్ తీసుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదలకానుంది. కాగా ఆ తదుపరి పవన్ నటించే సినిమా ఏమిటి? అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. అడిగిన అందరికీ వరాలిచ్చేస్తున్నాడు కానీ అవి ఎప్పుడు మొదలవుతాయో మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఆయన కోసం ప్రస్తుతం ముగ్గురు నలుగురు దర్శకులు వెయిటింగ్‌లో ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, డాలీ, ఎస్.జె.సూర్యలతో పాటు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా పవన్ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎప్పుడో ఏడాది ముందు దాసరి నారాయణరావు తమ తారకప్రభు బేనర్‌లో పవన్ ఓచిత్రం చేయనున్నట్లు ప్రకటించాడు. పవన్ కూడా ఆ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశాడు. మరి ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో? ఎవరు దర్శకత్వం వహిస్తారో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మరి పవన్ 'సర్దార్ గబ్బర్‌సింగ్' తర్వాత చేయబోయే చిత్రం కోసం ఆయన అభిమానులే కాదు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.