Advertisementt

తాగుబోతు రమేష్‌లో ఇంత టాలెంటా!!

Sun 17th Jan 2016 01:50 PM
taagubothu ramesh,short film,nannaku prematho,i know  తాగుబోతు రమేష్‌లో ఇంత టాలెంటా!!
తాగుబోతు రమేష్‌లో ఇంత టాలెంటా!!
Advertisement
Ads by CJ

తాగుబోతు రమేష్‌ మనకు కేవలం కమెడియన్‌గా మాత్రమే తెలుసు. కానీ అతనిలోని రచన, దర్శకత్వం వంటి టాలెంట్స్‌ గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఆయన కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. ఏకంగా ఆ ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తీసి చూపించాడు. ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం షూటింగ్‌ చాలారోజులు స్పెయిన్‌లో జరిగింది. ఆ సమయంలో రమేష్‌కు ఓ ఐడియా రావడం, వెంటనే స్క్రిప్ట్‌ రెడీ చేయడం షూటింగ్‌ పూర్తి చేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. 'ఐ నో' (నాకు తెలుసు) అనే పేరుతో ఆయన ఈ షార్ట్‌ ఫిలిం తెరకెక్కించాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌లో స్పెయిన్‌లో ఉండగా ఒక చిన్న ఐడియా తట్టింది. దీన్ని కథగా మలిచి రెండురోజుల్లో చిన్నషార్ట్‌ఫిల్మ్‌ తీశాను. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాను... అని తెలిపాడు తాగుబోతు రమేష్‌. ఈ షార్ట్‌ఫిలింకు స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలు తాగుబోతు రమేష్‌ స్వయంగా చేపట్టాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ