Advertisementt

కత్రినా-రణబీర్‌ల యవ్వారం అయిపొయింది!

Sun 17th Jan 2016 01:17 PM
katrina kaif,ranbir kapoor,deepika padukune,living together  కత్రినా-రణబీర్‌ల యవ్వారం అయిపొయింది!
కత్రినా-రణబీర్‌ల యవ్వారం అయిపొయింది!
Advertisement
Ads by CJ

గాలిలో మేడలు, నీటి మీద రాతలు... వంటి పదాలతో ఇండస్ట్రీలోని ప్రేమికులను ప్రేమాయణాన్ని పోల్చవచ్చు. మొత్తానికి ఇంతకాలంగా ప్రేమాయణం నడుపుతోన్న బాలీవుడ్‌ జంట కత్రినాకైఫ్‌-రణబీర్‌కపూర్‌ల జంట ఇప్పుడు విడిపోదాం...రా.. అంటున్నారు. ఈ ప్రేమజంట విడిపోవడానికి రెడీగా ఉంది. ఇంతకాలం ఏకంగా ఓ ఫ్లాట్‌నే కొనుగోలు చేసి కలిసి సహజీవనం చేస్తున్న ఈ జంట ప్యార్‌ కహాని కంచెకు వెళ్లినట్టే కనిపిస్తోంది. చిలకాగోరింకల్లా ఉన్న వీరిద్దరి మద్య దీపికా పడుకోనే చిచ్చుపెట్టిందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 'తమాషా' చిత్రంలో రణబీర్‌-దీపికాల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ అదిరిపోయింది. సినిమా ఫ్లాప్‌ అయినా ఈ కెమిస్ట్రీ మాత్రం అద్భుతం అంటూ అందరూ కితాబులిచ్చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే రణభీర్‌కపూర్‌కు దీపికాపడుకొనే చాలా 'దగ్గరైంది' అంటున్నారు. దీంతో రణభీర్‌ కపూర్‌పై ఉన్న కోపంతో కత్రినా కూడా 'ఫితూర్‌' చిత్రంలో ఆదిత్యరాయ్‌ కపూర్‌తో రెచ్చిపోయి నటించింది. కాగా ఇంతకాలం కత్రినా-రణభీర్‌లు కలిసి ఉంటున్న ప్లాట్‌లో ఇప్పుడు కత్రినా ఒక్కతే ఒంటరిగా ఉంటోంది. మొత్తానికి మరో బాలీవుడ్‌ ప్రేమకథ కంచికి చేరడానికి రెడీగా ఉందని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ