ఈ ఏడాది తొలిరోజున అంటే జనవరి 1వ తేదీన విడుదలైన చిత్రాల్లో 'నేను...శైలజ' మంచి విజయాన్ని సాధించి శుభారంభం ఇచ్చింది. ఇక గత వారం రోజులుగా ఈసారి సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దమైన నాలుగు చిత్రాలపైనే ప్రేక్షకుల ఆసక్తి అంతా నిలిచివుంది. ఎట్టకేలకు ఈ నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌టాక్‌తో దూసుకెళ్తున్నాయి. సెలవులు కావడంతో ఆదివారం వరకు అన్ని చిత్రాలు మంచి ఓపెనింగ్స్‌ను సాధించడం మామూలే. ఇక అసలు సిసలైన విజయం ఏదో తెలియాలంటే సోమవారం నుండి ఫలితం తేలిపోతుంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం క్లాస్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఇక బాలకృష్ణ నటించిన 'డిక్టేటర్' చిత్రం మాస్ జనాలను ఉర్రూతలూగిస్తోంది. మరోవైపు చిన్నచిత్రంగా విడుదలైన శర్వానంద్-మేర్లపాకగాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎక్స్‌ప్రెస్‌రాజా' కామెడీతో కడుపుబ్బ నవ్విస్తోంది. ఇక నాగార్జున ద్విపాత్రాభినయంతో కళ్యాణ్‌కృష్ణ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి వంటి హీరోయిన్లతో రూపుదిద్దుకున్న 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతో ఆకర్షిస్తోంది. మొత్తానికి సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ నాలుగు చిత్రాలకు మంచి ఆదరణే లభిస్తుండటం శుభపరిణామం.