Advertisementt

కృష్ణగాడి ప్రేమగాధకి ఇద్దరు హీరోల సపోర్ట్‌ !

Sun 17th Jan 2016 12:15 AM
nani,krishnagaadi veera premagadha movie,mahesh babu,balakrishna,nani new movie  కృష్ణగాడి ప్రేమగాధకి ఇద్దరు హీరోల సపోర్ట్‌ !
కృష్ణగాడి ప్రేమగాధకి ఇద్దరు హీరోల సపోర్ట్‌ !
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, ప్రభాస్‌, బాలకృష్ణ వంటి స్టార్స్‌ చిన్న హీరోలు సినిమాల ఆడియో వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరవ్వడం, వారి చేతుల మీదుగా ఆడియో విడుదల కావడం చూస్తేనే ఉన్నాం. పెద్దహీరోలు ఇలాంటి వేడుకలకు వచ్చారంటే ఆ సినిమాకు వారి నుండి... వారి ఫ్యాన్స్‌ నుండి కూడా మంచి సపోర్ట్‌ లభిస్తుంది. ఫలితంగా ఆయా సినిమాలకు మంచి ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. కాగా ఈనెల 18వ తేదీన జరుగబోయే నాని 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమా ఆడియో వేడుకకు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. మహేష్‌బాబుతో 'దూకుడు, 1 (నేనొక్కడినే), ఆగడు' చిత్రాలను నిర్మించిన 14రీల్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈచిత్రం ఫిబ్రవరి 5వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. దాంతో ఈ చిత్రానికి మహేష్‌తో పాటు ఆయన అభిమానుల అండదండలు కూడా పుష్కళంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో నాని బాలకృష్ణ వీరాభిమానిగా, ఆయన ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా 'జై బాలయ్య' అనే టట్టూను చేతిపై వేసుకొని వస్తున్నాడు. సో... ఈ చిత్రానికి బాలయ్య అభిమానుల నుండి కూడా మద్దతు రావడం ఖాయమనే చెప్పవచ్చు. మరి మహేష్‌, బాలయ్యల అభిమానుల సపోర్ట్‌తో రానున్న ఈ చిత్రం ఎలాంటి ఓపెనింగ్స్‌ను రాబడుతుందో వేచిచూడాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ