Advertisementt

'జనతాగ్యారేజ్‌' కి ప్రణాళిక సిద్ధం!

Sat 16th Jan 2016 07:08 PM
jr ntr,young tiger ntr,correct planing,koratala siva,mohan lal,mythri movie makers,janata garage movie  'జనతాగ్యారేజ్‌' కి ప్రణాళిక సిద్ధం!
'జనతాగ్యారేజ్‌' కి ప్రణాళిక సిద్ధం!
Advertisement
Ads by CJ

సంక్రాంతి బరిలోకి 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో దిగిన ఎన్టీఆర్‌ తనకు ఇంతకాలం అందని ద్రాక్షగా మిగిలిన 50కోట్ల క్లబ్‌లో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ చిత్రానికి క్లాస్‌ ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. కాగా ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రం 'జనతాగ్యారేజ్‌' (వర్కింగ్‌ టైటిల్‌)కు రెడీ అవుతున్నాడు. కొరటాల శివ దర్శత్వంలో 'శ్రీమంతుడు' చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ఈ చిత్రం పూజాకార్యక్రమాలు ఎప్పుడో లాంఛనంగా ప్రారంభం కూడా అయిపోయాయి. కాగా ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకానుందని సమాచారం. ఎన్టీఆర్‌ కొద్దిరోజుల గ్యాప్‌ తర్వాత అంటే ఫిబ్రవరి 17 నుండి ఈ చిత్రం సెట్స్‌లోకి ఎంటర్‌ కాబోతున్నాడు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని ఎలాగైనా అనుకున్న ప్రణాళిక ప్రకారం షూటింగ్‌ పూర్తి చేసి ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది దర్శకనిర్మాతల ప్లాన్‌. ఇందుకోసం వారు పక్కా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ కీలకమైన పాత్రను చేయనుండగా, సమంత, నిత్యామీనన్‌లు ఎన్టీఆర్‌ సరసన హీరోయిన్లుగా నటిస్తారని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ