ఏ హీరోకైనా 100వ చిత్రం అంటే ప్రెస్టీజియస్‌గా ఉంటుంది. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 99వ చిత్రం 'డిక్టేటర్' సంక్రాంతి కానుకగా 14వ తేదీన విడుదలైంది. పక్కా మాస్ యాక్షన్‌తో రూపొందిన ఈ చిత్రం బాలయ్య అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. బి,సి సెంటర్లలో ఈ చిత్రం హవా బాగా నడుస్తోంది. కాగా ఇప్పుడు బాలయ్య తన 100వ చిత్రంపై దృష్టి కేంద్రీకరించాడు. ఈ చిత్రాన్ని మార్చిలోనే ప్రారంభించాలని ఆయన డిసైడ్ అయ్యాడు. మరి ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనే విషయంలో జరుగుతున్న చర్చకు కూడా బాలయ్య క్లారిటీ ఇచ్చేశాడు. మార్చిలోపు బోయపాటిశ్రీను స్టోరీ రెడీ చేస్తే అతనితో తన 100వ చిత్రం చేస్తానని, అలా చేయని పక్షంలో మరొకరి చిత్రంలో నటిస్తానని కుండ బద్దలు కొట్టాడు. ఆయన 100వ చిత్రం దర్శకుల పోటీలో సీనియర్ దర్శకుడు, గతంలో బాలయ్యతో 'ఆదిత్య 369' చేసిన సింగీతం శ్రీనివాసరావు కూడా లైన్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆయన బాలయ్యతో 'ఆదిత్య369'కు సీక్వెల్‌గా 'ఆదిత్య 999' అనే స్టోరీని రెడీ చేస్తున్నాడు. మరోపక్క బోయపాటిశ్రీను విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో 'సరైనోడు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి చివరిలోపు షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్‌లో విడుదలకు సిద్దం అవుతోంది. అప్పటివరకు బోయపాటి ఆ సినిమాతోనే బిజీగా ఉండనున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చిత్రం చేయాల్సి ఉంది. మరి బాలయ్య ఇచ్చే 100వ చిత్రం ఆఫర్ కోసం బోయపాటి ఆ ప్రాజెక్ట్‌లను పక్కనపెట్టి బాలయ్య 100వ చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నం అవుతాడా? లేదా? అన్నది ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తానికి మార్చిలోపు ఎవరు పక్కా స్క్రిప్ట్‌తో వస్తే వారే బాలయ్య చేయబోయే 100వ చిత్రానికి దర్శకుడు అవుతారని, బాలయ్య మాత్రం ఎవరనేది పక్కనపెట్టి తనకు మార్చిలోపు మంచి స్క్రిప్ట్‌తో వచ్చిన వారికే అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది..!