Advertisementt

సిద్దార్ధ్‌..రాజమౌళియే ఎందుకు?

Sat 16th Jan 2016 05:42 PM
rajamouli,jil jung juck trailer,siddharth,jil jung juck trailer launch  సిద్దార్ధ్‌..రాజమౌళియే ఎందుకు?
సిద్దార్ధ్‌..రాజమౌళియే ఎందుకు?
Advertisement
Ads by CJ

తమిళ, తెలుగు భాషల్లో మంచి నటునిగా పేరుతెచ్చుకున్న హీరో సిద్దార్ధ్‌. కాగా ఆయన ఈమధ్య టాలీవుడ్‌ను వదిలేసి కేవలం తన సొంత భాష తమిళంకే పరిమితమైపోయాడు. తమిళంలో ఆయన నటించిన చిత్రాల అనువాదాలే తెలుగులోకి విడుదలవుతున్నాయి. కాగా ప్రస్తుతం సిద్దార్ధ్‌ 'జిల్‌ జంగ్‌ జక్‌' అనే వెరైటీ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ చాలారోజుల కిందటే పూర్తయినప్పటికీ చెన్నై వరదల కారణంగా విడుదల ఆలస్యమైంది. కాగా ఎట్టకేలకు ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. అది కూడా టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి చేతలు మీదుగా. 'బాహుబలి' చిత్రంతో రాజమౌళికి తమిళంలో కూడా బాగా క్రేజ్‌ వచ్చింది. సో... ఆ క్రేజ్‌ను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్న సిద్దార్థ్‌ తన చిత్రం ట్రైలర్‌ని ఆయన చేత విడుదల చేయించాడు. ఇలా ఆయన దర్శకధీరుడి ఇమేజ్‌ను వాడేసుకుంటున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చిత్రానికి నిర్మాత కూడా సిద్దార్దే కావడం విశేషం. ధీరజ్‌వాడై ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. మరి మన 'రాజ'ముద్ర సిద్దుకి ఎలా కలిసి వస్తుందో చూడాలి....! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ