Advertisementt

మరోసారి తమన్నా స్పీడు చూపించింది!

Fri 15th Jan 2016 04:42 PM
tamanna,speedunnodu trailer,bellamkonda saisrinivas,tamanna in speedunnodu item song  మరోసారి తమన్నా స్పీడు చూపించింది!
మరోసారి తమన్నా స్పీడు చూపించింది!
Advertisement
Ads by CJ

'అల్లుడు శీను' చిత్రంలోని ఓ ఐటంసాంగ్‌లో హీరో బెల్లకొండ సాయిశ్రీనివాస్‌తో కలిసి చిందులేసింది తమన్నా. ఈ చిత్రానికి తమన్నా ఐటంసాంగ్‌ కూడా బాగా ప్లస్‌ అయింది. ఇలా తన తొలిచిత్రంతోనే తమన్నాతో చిందులు వేసిన బెల్లకొండ శ్రీనివాస్‌ తన రెండో చిత్రంలో కూడా ఆమెతోనే మరో ఐటంసాంగ్‌ చేస్తున్నాడు. తాజాగా ఈ హీరో తన రెండో చిత్రంగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తమిళంలో హిట్టయిన 'సుందరపాండ్యన్‌'కు రీమేక్‌గా 'స్పీడున్నోడు' పేరుతో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా తమన్నా ఐటంసాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా ట్రైలర్‌ వచ్చింది. తమన్నా ఐటంసాంగ్‌ ఈ ట్రైలర్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. 'బ్యాచిలర్‌ బాబూ.. నా కోచింగ్‌తోటి బెస్ట్‌ హస్బెండౌతావు...' అంటూ సాగిన ఈ మసాలా పాటలో రెచ్చిపోయి నర్తించింది తమన్నా. మాసీ స్టెప్‌లతో ఇరగదీసింది. మొత్తం మీద మాస్‌ను కట్టిపడేసేలా ఉందీ పాట. ఇక ట్రైలర్‌ కూడా గ్రిప్పింగ్‌గానే ఉంది. డాన్స్‌లు, ఫైట్లతో మరోసారి ఆకట్టుకున్నాడు బెల్లంకొండ వారబ్బాయ్‌. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో చూడాల్సివుంది!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ