Advertisementt

పవన్ కి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో చరణ్!

Thu 14th Jan 2016 06:29 PM
  పవన్ కి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో చరణ్!
పవన్ కి ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో చరణ్!
Advertisement
Ads by CJ

తమిళంలో స్టైలిష్‌ మేకర్‌గా పేరు పొందిన దర్శకుడు విష్ణువర్దన్‌. కాగా ఆయన తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో 'పంజా' చిత్రం తెరకెక్కించాడు. మేకింగ్‌ పరంగా ఈ చిత్రానికి మంచి పేరే వచ్చినప్పటికీ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం విష్ణువర్ధన్‌ మెగాఫ్యామిలీకే చెందిన రామ్‌చరణ్‌తో కథాచర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఎలాంటి సినిమానైనా, హీరోనైనా మేకింగ్‌పరంగా ఓ స్థాయిలో చూపించగల దర్శకునిగా పేరు తెచ్చుకున్న విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేయాలనే ఉత్సాహంతో ఉన్నట్లు సమాచారం. మంచి కథతో వస్తే ఆయనతో సినిమా చేయడానికి తనకేమీ అభ్యంతరం లేదని రామ్‌చరణ్‌ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తమిళ 'తని ఒరువన్‌' రీమేక్‌కు ప్రిపేర్‌ అవుతూనే, మరోపక్క తమిళ దర్శకుడితో సినిమా చేయాలని చరణ్‌ ఆశపడుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్లానింగ్‌ దశలో ఉంది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళంలో కూడా ఏకకాలంలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్‌చరణ్‌ 'తని ఒరువన్‌' రీమేక్‌ విషయానికి వస్తే ఈ చిత్రానికి కథ, దర్శకుడు, నిర్మాత, హీరో... ఇలా అందరూ ఫిక్స్‌ అయినా కూడా ఈ చిత్రం షూటింగ్‌ ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది? అనే విషయం ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశం అయింది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి కొన్ని మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్‌ను కూడా సిద్దం చేసేశాడు. కాగా రామ్‌చరణ్‌ ఇందులో పోలీస్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇంతకు ముందు ఆయన 'జంజీర్‌' (తుఫాన్‌) చిత్రంలో కూడా పోలీస్‌గా నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈసారి చేసే పోలీస్‌ పాత్రను మరింత డిఫరెంట్‌గా, ప్రత్యేకమైన గెటప్‌తో పాటు ఫిజిక్‌పై కూడా రామ్‌చరణ్‌ దృష్టి పెట్టాడని, అందుకు తగ్గ కసరత్తులు చేస్తున్నాడని, అందుకే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ