మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి త్వరలో విలన్‌గా నటించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 'జిల్లా' చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి నటించిన తమిళ స్టార్ విజయ్ తన 60వ చిత్రంలో విలన్ పాత్రకు మమ్ముట్టిని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే ఈ చిత్రానికి తమిళంలోనే గాక మలయాళంలోనూ మంచి బిజినెస్ క్రేజ్ ఏర్పడటం ఖాయం అంటున్నారు. 'పులి' చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి చేత, 'జిల్లా'లో మోహన్‌లాల్ చేత పాత్రలు చేయించి సినిమాలకు క్రేజ్ తీసుకొని వచ్చిన విజయ్ తన 60వ చిత్రానికి మమ్ముట్టిని ఎంచుకోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. కాగా ఈ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహించనున్నాడు. ఆయన చెప్పిన స్టోరీకి విజయ్ కొన్ని మార్పులు, చేర్పులు చెప్పడంతో ఈ పనిలో ప్రస్తుతం డైరెక్టర్ భరతన్ తలమునకలై ఉన్నాడని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.