Advertisementt

'అటాక్‌'కు మోక్షం లభించనుంది..!

Thu 14th Jan 2016 05:27 PM
attack movie,manchu vishnu,ram gopal varma,surabhi  'అటాక్‌'కు మోక్షం లభించనుంది..!
'అటాక్‌'కు మోక్షం లభించనుంది..!
Advertisement
Ads by CJ

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అటాక్‌'. చాలాకాలం కిందటే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఆమధ్య ట్రైలర్లు కూడా విడుదల చేసి హడావుడి చేశారు. ఏమైందో తెలియదు కానీ సినిమా ఇప్పటికీ రిలీజ్‌ కాలేదు. అటు మనోజ్‌గానీ, ఇటు వర్మ గానీ ఈ సినిమా గురించి ఈమధ్య ఎక్కడా మాట్లాడటం లేదు. ఏదో సమస్య ఉండటం వల్లనే ఇలా జరిగిందని అంటున్నారు. తాజాగా సమస్యలు ఓ కొలిక్కి రావడంతో ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ చిత్రం ఆడియో విడుదలకానుంది. సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా అదే రోజు ప్రారంభించనున్నారు. అదే నెలలో సినిమాను కూడా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, వడ్డే నవీన్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల కాలంలో వర్మ తీసిన చిత్రాలలోకెల్లా బడ్జెట్‌పరంగా ఈ 'అటాక్‌' చిత్రమే భారీ చిత్రం అని చెప్పవచ్చు. కాగా ఇందులో సురభి హీరోయిన్‌గా నటించనుంది. పూర్తి యాక్షన్‌ ఫ్యాక్షన్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను మొదట దగ్గుబాటి రానాతో చేయాలని భావించారు. కానీ చివరి నిమిషంలో ఆ స్థానంలోకి మంచు మనోజ్‌ ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ చిత్రంలో మనోజ్‌లోని యాక్షన్‌ యాంగిల్‌ను పూర్తిగా వాడుకున్నారట...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ