Advertisementt

పండగకే కాదు.. లవర్స్‌డేకు కూడా బన్నీ ట్రీట్‌..!

Wed 13th Jan 2016 12:25 PM
allu arjun,rakul preeth singh,sarainodu movie  పండగకే కాదు.. లవర్స్‌డేకు కూడా బన్నీ ట్రీట్‌..!
పండగకే కాదు.. లవర్స్‌డేకు కూడా బన్నీ ట్రీట్‌..!
Advertisement
Ads by CJ

అల్లుఅర్జున్‌ హీరోగా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ మెయిన్‌హీరోయిన్‌గా, కేథరిన్‌ సెకండ్‌ హీరోయిన్‌గా, శ్రీకాంత్‌, ఆది పినిశెట్టిలు కీలకపాత్రల్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ పతాకంపై అల్లుఅరవింద్‌ నిర్మిస్తున్న చిత్రం 'సరైనోడు' (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఎలాంటి హడావుడి లేకుండా శరవేగంగా పూర్తవుతోంది. ఇందులో బన్నీ పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈచిత్రం షూటింగ్‌ దాదాపు 80శాతం పూర్తయింది. సంక్రాంతి పండుగ తర్వాత అంటే జనవరి 25 నుండి మరో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. కాగా ఈచిత్రంలో 'లోఫర్‌' హీరోయిన్‌ దిశాపటాని బన్నీతో కలిసి ఓ స్పెషల్‌ ఐటంసాంగ్‌లో నర్తించనుంది. కాగా ఈచిత్రం టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేస్తూ సంక్రాంతి కానుకగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ తన అభిమానులకు మూడు నెలల్లో మూడు ట్రీట్స్‌ ఇవ్వనున్నాడన్న మాట...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ