Advertisementt

ఫిబ్రవరి పోటీ కూడా రంజుగానే ఉండనుంది..!

Tue 12th Jan 2016 08:34 PM
raj tarun,sunil,nani,krishnashtami movie,a aa movie  ఫిబ్రవరి పోటీ కూడా రంజుగానే ఉండనుంది..!
ఫిబ్రవరి పోటీ కూడా రంజుగానే ఉండనుంది..!
Advertisement
Ads by CJ

వాస్తవానికి మన దర్శకనిర్మాతలు, హీరోలు ఫిబ్రవరి అన్‌సీజన్‌ అని భావిస్తారు. కానీ ఆమధ్య ఫిబ్రవరిలో విడుదలైన 'మిర్చి', ఎన్టీఆర్‌ నటించిన 'టెంపర్‌' చిత్రాలు ఫిబ్రవరిలో విడుదలై కూడా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు అందరూ ఫిబ్రవరిని కూడా టార్గెట్‌ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిని మన యంగ్‌ హీరోలు మాత్రమే టార్గెట్‌ చేస్తుండటం విశేషం. ముఖ్యంగా ఫిబ్రవరి 5వ తేదీన మూడు చిత్రాలు పోటీ పడటానికి రెడీ అవుతున్నాయి. బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తమిళ 'సుందరపాండ్యన్‌'కు రీమేక్‌గా రూపొందుతున్న 'స్పీడున్నోడు'.. సునీల్‌ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో 'జోష్‌' ఫేమ్‌ వాసువర్మ తెరకెక్కిస్తున్న 'కృష్ణాష్టమి', నాని హీరోగా 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌సుంకర నిర్మాతగా, 'అందాలరాక్షసి' ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' చిత్రాలు ఫిబ్రవరి 5నే టార్గెట్‌ చేసుకున్నాయి. ఈ చిత్రం ఆడియోను జనవరి 18న జరుపనున్నారు. ఇక నితిన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అ...ఆ' చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో విడుదలకు ముస్తాబవుతోంది. వీటితో పాటు రాజ్‌తరుణ్‌ నటిస్తున్న 'సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు' కూడా ఫిబ్రవరికే ముస్తాబవుతుండటం విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ