విజయాలు ఉంటేనే సినీపరిశ్రమలో ఎవరైనా పలకరిస్తారు. ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే ఇక పిలుపే గగనం అయిపోతుంది. కానీ వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్‌లను పొందిన రకుల్‌ప్రీత్‌సింగ్ వ్యవహారం మాత్రం దీనికి కాస్త భిన్నంగా కొనసాగుతోంది. ఆమె కెరీర్‌లో 'వెంకటాద్రిఎక్స్‌ప్రెస్, లౌక్యం' వంటి హిట్స్ మాత్రమే ఉన్నాయి. కాగా ఆమెకు 'కరెంట్‌తీగ' నుండి వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్నాయి. ఆమె హీరోయిన్‌గా నటించిన 'బ్రూస్‌లీ, కిక్2' చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఆమెకు స్టార్‌హీరోలతో కలిసి రావడం లేదనే అపప్రధ ఏర్పడింది. అయినా కూడా ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'నాన్నకుప్రేమతో'.. అల్లుఅర్జున్ సరసన 'సరైనోడు' చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలు 'బ్రూస్‌లీ' విడుదలకు ముందు కమిట్ అయిన చిత్రాలు కావడం గమనార్హం. ఈ రెండు చిత్రాలలో తప్ప ఆమెకు ఇప్పటివరకు మరో సినిమా అవకాశం రాలేదు. దీంతో వరుస ఫ్లాప్‌లతో ఈ అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. ప్రస్తుతం రకుల్ ఆశలన్నీ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో'పైనే. ఈ చిత్రంతో ఎన్టీఆర్ తనకు మంచి హిట్టు ఇచ్చి తన కెరీర్‌ను నిలబెడతాడని గంపెడాశలతో ఎదురుచూస్తోంది. ఇలా 'నాన్నకు ప్రేమతో' చిత్రం తన బ్యాడ్ సెంటిమెంట్‌ను పోగొడుతుందనే నమ్మకంతో ఉంది. దీంతో ఆవిడ ఆశలన్నీ ఎన్టీఆర్,బన్నీల మీదనే ఉంది. ముఖ్యంగా ఆమెకు రేపే విడుదల కానున్న 'నాన్నకుప్రేమతో'పైనే భారీ ఆశలు ఉన్నాయి. ఈ చిత్రంలో ఆమెను సుకుమార్ చాలా అందంగాచూపించాడని, అలాగే ఆమె గ్లామర్‌షో కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ కానుందని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.