Advertisementt

'ఎక్స్‌ప్రెస్‌రాజా'కు మంచి రేటు..!

Tue 12th Jan 2016 04:56 PM
express raja movie,sharvanandh,surabhi,merlapaka gandhi   'ఎక్స్‌ప్రెస్‌రాజా'కు మంచి రేటు..!
'ఎక్స్‌ప్రెస్‌రాజా'కు మంచి రేటు..!
Advertisement
Ads by CJ

'రన్‌ రాజా రన్‌, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' వంటి సూపర్‌హిట్స్‌తో దూసుకెళ్తున్న యంగ్‌ ఎనర్జిటిక్‌ హీరో శర్వానంద్‌, 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో తన మొదటి చిత్రంతోనే బంపర్‌హిట్‌ సొంతం చేసుకున్న దర్శకుడు మేర్లపాక గాందీ దర్శకత్వంలో సురభి హీరోయిన్‌గా నటిస్తున్న 'ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండటం.... మంచి అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తారని అతికొద్ది చిత్రాలతోనే నిరూపించుకున్న సంస్థ కావడం... వంటి అనేక అంశాలు ఈ చిత్రంపై అంచనాలను బాగా పెంచాయి. కాగా ఇప్పటికే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో మంచి సత్తా చాటిన ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులు కూడా భారీ రేటుకే అమ్ముడుపోయాయి. శర్వానంద్‌ చిత్రాలకు టీవీ చానెల్స్‌లో మంచి డిమాండ్‌ ఉండటంతో ఈ చిత్రాన్ని మాటీవీ చానెల్‌ 3.25కోట్లకు సొంతం చేసుకుంది. మొత్తానికి 'ఎక్స్‌ప్రెస్‌రాజా' మిగిలిన పెద్ద సినిమాలతో అన్ని విషయాలలోనూ సరిసమానంగా ముందుకు దూసుకెళ్లుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ