Advertisementt

జూనియర్ ఎన్టీయార్ సంగతి తేలిపోద్ది!

Tue 12th Jan 2016 04:52 PM
jr ntr,nannaku prematho collectoions  జూనియర్ ఎన్టీయార్ సంగతి తేలిపోద్ది!
జూనియర్ ఎన్టీయార్ సంగతి తేలిపోద్ది!
Advertisement
Ads by CJ

కారణాలు ఏమైనా గత కొన్నాళ్ళుగా జూనియర్ ఎన్టీయార్ కెరీర్ మందకొడిగా సాగుతున్న మాట వాస్తవమే. తాను ఎంచుకున్న కథల్లో లోపం ఉందో లేక దర్శకుల్లో లోపం ఉందో అన్న ప్రశ్నలు పక్కన పెడితే తారక్ స్టార్ డం ప్రయాణం మాత్రం అనుకున్నంత వేగాన్ని పుంజుకోలేదు. ఒక వైపు తోటి స్టార్ హీరోలందరూ 40, 50 కోట్ల క్లబ్బుల్లో అవలీలగా చేరిపోయి వంద కోట్లకి ఎగబాకుతుంటే ఎన్టీయార్ మాత్రం ముక్కుతూ మూలుగుతూ ముందుకు సాగుతున్న వైనం మనం అందరం గమనిస్తున్నదే. కానీ అకస్మాత్తుగా నాన్నకు ప్రేమతో చిత్రం పైన ఆకాశాన్ని తాకే అంచనాలు ఏర్పడ్డాయి. ఇన్నేళ్ళుగా తాను కోల్పోయినదేమిటో కాసింత ఆలస్యంగా తెలుసుకుని, తేరుకున్న యంగ్ టైగర్ నాన్నకు ప్రేమతో ప్రమోషన్ పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఎన్ని చేసినా ప్రస్తుతం ఉన్న వ్యాపార ప్రామాణికాల దృష్ట్యా నాన్నకు ప్రేమతో కనీసం 60 కోట్లు వసూల్ చేస్తే గానీ సరైన సినిమా అనిపించుకోదు. మరి ఎన్టీయార్లో అంత సత్తా ఉందో లేదో ఇంకో రెండు రోజులు వేచి చూస్తే తేలిపోద్ది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ