Advertisementt

భోగవల్లిపై కేసు వేసిన పవన్ కళ్యాణ్!

Tue 12th Jan 2016 04:50 PM
pawan kalyan,case,bvsn prasad,aththarintiki daaredi  భోగవల్లిపై కేసు వేసిన పవన్ కళ్యాణ్!
భోగవల్లిపై కేసు వేసిన పవన్ కళ్యాణ్!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కొలవడానికి ఏ మీటరు లేదు. కానీ అటువంటి వ్యక్తి నేడు నాన్నకు ప్రేమతో నిర్మాత భోగవల్లి ప్రసాద్ గారిపైన MAA మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో కేసు వేయడం సంచలనం అయింది. పవన్, ప్రసాద్ గారు కలిసి చేసిన సినిమా అత్తారింటికి దారేది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఎన్నో సంచలనాలు సృష్టించి హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. అప్పట్లో ప్రసాద్ గారు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే. అందుకోసం పవన్, త్రివిక్రమ్, సమంతాలో తమ పారితోషికంలో కొంత భాగాన్ని మినహాయించుకుని సినిమా రిలీజుకు దోహదపడ్డారు. ప్రసాద్ గారు తన తదుపరి సినిమా నాన్నకు ప్రేమతో విడుదలలోపు పవన్ కళ్యాణ్ గారికి బకాయి పడిన కొంత పారితోషికాన్ని చెల్లిస్తానని మాట ఇవ్వడం, అది నిలుపుకోలేక పోవడంతో పవన్ MAAని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. MAA నుండి ఈ కేసును నిర్మాతల మండలికి కూడా పంపినట్టు సమాచారం. కొసమెరుపు ఏమిటంటే ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేకుండా నాన్నకు ప్రేమతో విడుదలకు సన్నాహాలు జరగుతూ ఉండడం. అత్తారింటికి విడుదలయ్యి రెండేళ్ళు దాటిన తరువాత పవన్ కేసు వేయడం కొంత మందికి రుచించకపోయినా, ఇది మాత్రం అక్షరాలా సత్యం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ