Advertisementt

బన్నీ అడిగాడని స్పెషల్ షో!

Mon 11th Jan 2016 03:35 PM
allu arjun,nannaku prematho,special show for bunny,ntr,sukumaar  బన్నీ అడిగాడని స్పెషల్ షో!
బన్నీ అడిగాడని స్పెషల్ షో!
Advertisement
Ads by CJ

సుకుమార్‌-అల్లుఅర్జున్‌ల మద్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇద్దరి కాంబినేషన్‌లో రెండు చిత్రాలు వచ్చాయి. '100%లవ్‌' కథ కూడా బన్నీ కోసం రాసుకొన్నదే. చివరికి గీతాఆర్ట్స్‌ బేనర్‌లోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీ కూడా రానుందని తెలుస్తోంది. కాగా 'నాన్నకు ప్రేమతో' సినిమా పట్ల బన్నీ ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. సినిమా ఎలాగొచ్చింది? అంటూ సుకుమార్‌ని అడిగాడట. అందరికంటే నాకే ముందు చూపించాలి అని ఆర్డర్‌ కూడా వేశాడట. దానికి సుక్కు సైతం ఓకే చెప్పేశాడని టాక్‌. రాజమౌళి, ప్రభాస్‌, బన్నీ, నాగ్‌... వీళ్లందరి కోసం సుకుమార్‌ ఓ స్పెషల్‌ షో ప్లాన్‌ చేస్తున్నాడని సమాచారం. 12వ తేదీ అర్థరాత్రి హైదరాబాద్‌లో ఈ షో ఉంటుందని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ