మెగాక్యాంప్‌లోకి ఒక హీరోయిన్ ప్రవేశించింది అంటే అక్కడి హీరోలందరూ ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. తాజాగా అదే దారిలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ నడుస్తోంది. ఇటీవలే రామ్‌చరణ్ సరసన 'బ్రూస్‌లీ' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఆమె ప్రస్తుతం అల్లుఅర్జున్‌తో 'సరైనోడు' చిత్రంలో కలిసి నటిస్తోంది. గీతాఆర్ట్స్‌బేనర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్‌లో సమ్మర్ కానుకగా విడుదలకానుంది. కాగా 'లోఫర్' చిత్రం తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న మరో మెగా హీరో వరుణ్‌తేజ్ త్వరలో రెండు సినిమాలతో బిజీ కానున్నాడు. ఈ రెండు చిత్రాలకు గోపీచంద్ మలినేని, క్రిష్‌లు దర్శకత్వం వహించనున్నారు. మరి ఈ రెండింటిలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఏ సినిమాలో తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది...!