Advertisementt

అఖిల్‌ తరహాలోనే మోక్షజ్ఞ..!

Mon 11th Jan 2016 08:53 AM
akhil akkineni,mokshagna,balakrishna,adithya 999 movie  అఖిల్‌ తరహాలోనే మోక్షజ్ఞ..!
అఖిల్‌ తరహాలోనే మోక్షజ్ఞ..!
Advertisement
Ads by CJ

నందమూరి ఫ్యామిలీ నుండి సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణలు నటులుగా పరిచయం అయ్యారు. ఈ ఇద్దరిలో అత్యధిక చిత్రాలు చేసి అద్భుతమైన ఫాలోయింగ్‌ కలిగి స్టార్‌గా ఎదిగిన ఘనత బాలకృష్ణకే సొంతం. ఆ తర్వాత ఆ వంశం నుండి జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌, తారకరత్న... వంటి వారు పరిచయం అయినప్పటికీ ఎక్కువగా సక్సెస్‌ అయిన ఇమేజ్‌ పెంచుకొన్నది మాత్రం జూనియర్‌ ఎన్టీఆరే. కాగా త్వరలో నందమూరి వంశం నుండి మరో వారసుడు సినీరంగానికి పరిచయం కావడానికి రెడీ అవుతున్నాడు. అతను మరెవ్వరో కాదు.. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ. ఇతనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం విదేశాల్లో నటనతో పాటు డాన్స్‌లు, ఫైట్స్‌ వంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. తమ వారసులను ప్రమోట్‌ చేయడానికి అక్కినేని, మెగా ఫ్యామిలీలు ఏ రూట్‌ను ఫాలో అయ్యారో... ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా తన కుమారుడి ఎంట్రీకి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఈమధ్యకాలంలో కొడుకుల సినిమాల్లో తండ్రులు తళుక్కున మెరిసి సినిమాకు మరింత క్రేజ్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అఖిల్‌ హీరోగా పరిచయం కాముందే 'మనం' చిత్రంలో తళుక్కున మెరిసి సడన్‌ ఎంట్రీ ఇచ్చి అభిమానులకు తనపై ఉన్న అంచనాలను పెంచేశాడు. ఇప్పుడు ఇదే బాటను మోక్షజ్ఞతో కూడా చేయించాలని బాలయ్య డిసైడ్‌ అయినట్లు సమాచారం. బాలయ్య తన 100వ చిత్రం తర్వాత రిటైర్‌మెంట్‌ ప్రకటించి రాజకీయాల్లో బిజీ కానున్న సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య నటించే 100వ చిత్రంలో మోక్షజ్ఞ చేత సర్‌ప్రైజ్‌గా ఉండేలా ఓ పాత్ర చేయించాలని బాలయ్య డిసైడ్‌ అయ్యాడట. బాలయ్య, హరికృష్ణలు కూడా తమ తండ్రి సీనియర్‌ ఎన్టీఆర్‌ టాప్‌ ప్లేస్‌లో ఉన్నప్పుడే ఆయన చిత్రాలలో నటించి నటనలో ఓనమాలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను బాలయ్య పాటిస్తున్నాడు. తన 100వ చిత్రంలో మోక్షజ్ఞ చేత ఓ పాత్రను చేయించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఆయన నటించిన 99వ చిత్రం 'డిక్టేటర్‌' విడుదలకు సిద్దం అవుతోంది. ఈ చిత్రం విడుదలైన వెంటనే అంటే ఈ ఏడాదే బాలయ్య 100వ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఇదే ఏడాది జరగనుందని విశ్వసనీయ సమాచారం. అయితే బాలయ్య 100వ చిత్రం ఎవరి దర్శకత్వంలో చేయనున్నాడు? అనే విషయంపై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలయ్య 100వ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నాడని కొందరు అంటుండగా, మరి కొందరు మాత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య 100వ చిత్రం ఉంటుందని భావిస్తున్నారు. అప్పట్లో సింగీతం దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన 'ఆదిత్య 369'కు సీక్వెల్‌గా బాలయ్యతో సింగీతం 'ఆదిత్య 999' చేయనున్నాడని, అదే బాలయ్య 100వ చిత్రం కానుందని, ఈ చిత్రం స్టోరీని కూడా ఇప్పటికే సింగీతం శ్రీనివాసరావు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ యువరాజు పాత్ర ఉంటుందని, ఆ పాత్రనే మోక్షజ్ఞ పోషిస్తాడని కొందరు వాదిస్తున్నారు. మరి ఈ రెండింటిలో బాలయ్య చివరి చిత్రం ఏది కానుంది? అనేది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ