Advertisementt

భారీ రేటుకు 'సోగ్గాడు' అమ్మకం..!

Sun 10th Jan 2016 06:53 PM
nagarjuna,soggade chinni nayana,jaya,upiri movie  భారీ రేటుకు 'సోగ్గాడు' అమ్మకం..!
భారీ రేటుకు 'సోగ్గాడు' అమ్మకం..!
Advertisement
Ads by CJ

తన తాజా చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని జనవరి 15న విడుదలకు సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దాదాపు అన్ని ఏరియాల్లో నాగ్‌ స్వయంగా రిలీజ్‌ చేస్తున్నాడు. 'మనం' సినిమా మంచి విజయం సాధించి ఘనవిజయం సాధించినప్పటికీ నిర్మాతగా నాగ్‌కు మిగిలింది పెద్దగా లేదు. డిస్ట్రిబ్యూటర్లు సరైన లెక్కలు చూపించకుండా ఎగవేయడంతో ఈ చిత్రం అంత పెద్ద హిట్‌ అయినా నాగ్‌కు ఏమీ మిగలలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నాగే ఈ చిత్రాన్ని స్వయంగా రిలీజ్‌ చేయడానికి సిద్దం అవుతున్నాడు. మరో పక్క ఈ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. నాగార్జున సినిమాలకు టీవీ మాధ్యమంలో మంచి క్రేజ్‌ ఉండటంతో ఈ చిత్రం శాటిలైట్‌ హక్కులను జెమిని చానెల్‌ 6.5కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా త్వరలో నాగార్జున మహిళా దర్శకురాలు 'చంటిగాడు, లవ్‌లీ' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బి.ఎ.జయ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని, ఆమె డైరెక్షన్‌లో సినిమా చేయడానికి నాగ్‌ అంగీకరించాడని సమాచారం. ఇక 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి వస్తే.. ఇప్పటికే ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి, అనసూయ, హంసానందిని వంటి భామలు నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో స్వీటీ అనుష్క కూడా ఓ అతిథి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ విషయాన్ని సినిమా రిలీజ్‌ అయ్యే వరకు గోప్యంగా ఉంచాలని నాగ్‌ భావించాడని సమాచారం. థియేటర్లలో అనుష్కను చూసి ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలవ్వాలని అనుకొన్నాడట నాగ్‌. కాగా ఆమె ఆల్‌రెడీ నాగ్‌ నటిస్తున్న మరో చిత్రం 'ఊపిరి'లో కూడా ఓ అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. నాగ్‌ చిత్రాల్లో అనుష్క అతిథి పాత్రల్లో మెరవడం విన్నవారు అనుష్క నాగ్‌ కోసం ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే అనుష్కకి హీరోయిన్‌గా చాన్స్‌ ఇచ్చింది నాగార్జుననే కావడం అందుకు కారణం అంటున్నారు అక్కినేని అభిమానులు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ